ఆద్యంతం నవ్విస్తాం

ఆద్యంతం నవ్విస్తాంకడుపుబ్బా నవ్వుకునే కామెడీ సినిమాలు రావటం అరుదుగా మారుతున్న తరుణంలో, కుటుంబ మంతా కలిసి నవ్వుకునేలా ‘ఆరు’ చిత్రం ప్రేక్షకులకు ముందుకు రానుంది. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్న చిత్రమిది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈనెల 15న ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ పిఠాపురంలో విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను టీడీపీ నాయకులు వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నార్నే నితిన్‌, నయన్‌ సారిక, నిర్మాత బన్నీ వాస్‌, డైరెక్టర్‌ అంజి కె.మణిపుత్ర, కో ప్రొడ్యూసర్‌ బాలు, టీడీపీ నాయకుడు వర్మ, ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ‘ట్రైలర్‌లో ఎంతగా నవ్వించామో, సినిమా అంతా అలాగే ఎంజారు చేస్తారు. నవ్వుతూనే చిన్న చిన్న ఎమోషన్స్‌ను చూపించాం. నిర్మాత బన్నీవాస్‌ ఎంతో సపోర్ట్‌ అందించారు’ అని దర్శకుడు అంజి కె.మణిపుత్ర చెప్పారు. హీరో నార్నే నితిన్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తుందంటే కారణం మా డైరెక్టర్‌, నిర్మాతలే. అంకిత్‌, కసిరెడ్డి లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి. పిల్లర్స్‌లా వాళ్లు కష్టపడ్డారు’ అని తెలిపారు.
‘ఆరు’.. ఇది పక్కా గోదావరి జిల్లాల సినిమా. సినిమా థియేటర్‌ నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారని నేను గ్యారెంటీగా చెప్పగలను. పిఠా పురంలో సినీ వేడుకను నిర్వ హించి కొత్త అడుగు వేశాం. భవిష్యత్తులో ఈ బాటలో మరింత మంది అడుగులు వేస్తారని నమ్ము తున్నాను. రామ్‌ మిర్యాలది పిఠా పురం అనేది నాకు తెలియదు. ఈ సినిమా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడే తెలిసింది. ఇక్కడ వ్యక్తి కాబట్టే నాయకి అనే సాంగ్‌తో పాటు మరో సాంగ్‌ను అద్భుతంగా కంపోజ్‌ చేశారు.
– నిర్మాత బన్నీ వాస్‌