మా చెరువు – మా ఇష్టం..!

– మట్టిని తవ్వి అమ్ముకుంటాం, ఆక్రమించు కుంటాం
– అడగటానికి నీవెవరు ?
– ఫొటోలు తీసి అధికారులకు పంపిస్తావా..
– నీ అంతు సూస్తాం… అంటూ జర్నలిస్టు ఇంటి పై దాడి చేసిన మట్టి మాఫియా..
నవతెలంగాణ – పెద్దవూర
చెరువులో మట్టిని తవ్వాలన్న అధికారులు అనుమతి అవసరం. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులో మట్టినీ తవ్వి అక్రమ దందా నిర్వహిస్తు మండలంలో  మట్టి మాఫియా రెచ్చిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టిని వ్యవసాయ  భూముల్లో,వేంచర్లకు పొలాలు ఇండ్ల మధ్యలో ఉన్న ఇటుక బట్టీలకు యాదేచ్చగా మట్టిదందా నడుస్తుంది.మండలంలో మట్టి మాఫియా  అనుమతులు లేకుండా మట్టి తవ్వి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. మండలం లోని నాయిన వాణికుంట చెరువులో గత మూడు రోజులుగా కొల్లగొట్టి మట్టిని తరలించుకుపోతున్నారు. కొంత మంది ట్రాక్టర్ యజమానులు మట్టి మాఫియా అవతారం ఎత్తి వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి.మండలం లోని నాయినవానికుంట చెరువు మట్టి గత కొద్ధి రోజులు గా పెద్దవూర లోని వెంచర్ల కు తరలిస్తున్నారు. మట్టిని ట్రాక్టర్లల్లో ఖాళీ స్థలాలు, లేఅవుట్లుకు తరలిస్తూ ఒక్కొక్క ట్రాక్టర్ ఐదు వందల నుంచి 800 వరకు వసూలు చేస్తున్నారు భారీగా మట్టి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో చెరువులలో తీసిన మట్టిని రైతులకు ఉపయోగపడే మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి ఫొటోలు తీసిన ఓ జర్నలిస్ట్ పై నాయినవానీకుంట తాండకు చెందిన మట్టి మాఫియా దాడికి దిగి మాయిష్టం మా చెరువు మా ఇష్టం మేము మట్టిటోలుకుంటాం, ఆక్రమించు కుంటాం, ఫొటోలు తీసి తహసీల్దార్ కు పంపిస్తావా అంటూ తన ఇంట్లో వున్న నవతెలంగాణ జర్నలిస్ట్ పై సోమవారం దాడికి దిగారు. గ్రామానికి చెందన ఓ వ్యక్తి అడ్డు వస్తే అతనిని భయబ్రాంతులకు గురి చేశారు.
మట్టి తొలకాన్ని నిలపి వేస్తాం. తహసీల్దార్.. సరోజ పావని – పెద్దవూర
నాయిన వాణికుంట చెరువు మట్టిని తోలుతున్నట్లు మాకు ఎలాంటి సమాచారం రాలేదు. అక్కడికి వెళ్లి పరిశీలించి అనుమతులు లేకుండా మట్టిని రవాణా చేసిన్నట్లు ఉంటే వెంటనే నిలిపి వేస్తాము. చట్ట పరంగా చర్యలు తీసుకుంటాము.