నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజరు బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణి మీడియాతో మాట్లాడుతూ, ‘నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు నుంచి అన్నమ్మయ్య,. శ్రీరామ దాసు ఇలా అన్ని వైవిధ్యమైన చిత్రాలు చేశాను. మా కాంబినేషన్ ఎప్పుడూ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ సినిమా కూడా అలాంటి విజయం అందుకుంటుంది. ఇది మరో ప్రెసిడెంటు గారి పెళ్ళాం అవుతుందని ఆశిస్తున్నాను. సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని దర్శకుడు విజరు బిన్నీ రూపొందించారు. చంద్రబోస్ రాసిన పాటలు, నేను చేసిన సంగీతం రెండూ ఫ్రెష్‌గా ఉంటాయి’ అని చెప్పారు.