మున్సిపల్ అవినీతిపై సీఎంను కలుస్తాం

నవతెలంగాణ -దుబ్బాక 
మున్సిపల్ లో జరిగిన అవినీతి,అక్రమాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) ప్రతినిధులు గుండ్ల శివప్రసాద్, అశోక్ కుమార్ కాకర్ల తెలిపారు.రికార్డుల నిర్వహణ సరిగా లేదని.. అధికారులు దాటవేసే సమాధానమిస్తున్నారని, భారీగా ప్రభుత్వ నిధులను తమ జేబుల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించారు.ఫైళ్ళ తనిఖీలో భాగంగా రెండోరోజైన శనివారం దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయంలో సీసీఆర్ సభ్యులతో కలిసి విలేకరులతో వారు మాట్లాడారు. 2020-25 వరకు దుబ్బాక మున్సిపల్ లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు తమ తనిఖీలో గుర్తించమన్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, సీఎం, గవర్నర్, రాష్ట్ర మున్సిపల్ కార్యాలయంలో పూర్తి నివేదికను అందిస్తామని.. అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకునేలా సీసీఆర్ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. సీసీఆర్ సభ్యులు కరీముద్దీన్, చరణ్ కాంత్, రత్నాకర్, రాజు, గణేష్ పలువురున్నారు.