కాంగ్రెస్ 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తాం

  • ఇంటింటి ప్రచారంలో డిండి మండలం మల్లేష్ నాయక్

నవతెలంగాణ డిండి: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీ పథకాలు అమలు చేస్తామని డిండి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నట్టు డిండి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడావత్ మల్లేష్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… మహాలక్ష్మి పథకం ద్వారా కుటుంబంలో మహిళకు నెలకు 2500 రూపాయల నగదు, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రైతు భరోసా పథకం ఎకరాకు 15 వేల రూపాయల పెట్టుబడి ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్, వ్యవసాయ కూలీలకు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని ఆయన అన్నారు.
గృహ జ్యోతి పథకం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇంటి పథకం, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం, యువ వికాస పథకం ద్వారా విద్యార్థులకు ఐదు లక్షలతో విద్య భరోసా కార్డు, చేయూత పెన్షన్,, ఆసరా పెన్షన్ 4000 రూపాయలకు పెంచి ప్రజలకు ఇస్తామని ఆయన అన్నారు.