పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

నవతెలంగాణ-చౌటుప్పల్‌
ప్రజలందరూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని దివిస్‌ లేబరేటరీస్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.రామకష్ణ అన్నారు. సోమవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామంలోని దివిస్‌ పరిశ్రమలో వరల్డ్‌ ఎన్విరాన్మెంట్‌ డేను నిర్వహించారు. దివిస్‌ పరిశ్రమ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు ప్లాస్టిక్‌ వాడకం, తగ్గించుటపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ నిర్మూలించి, చెట్లను పెంచి భూమిపై సమస్త జీవకోటి సుఖ సంతోషాలతో ఉండేలా చేద్దామని ఈహెచ్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దివిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గుమ్మడి హేమంత్‌, పెండ్యాల శ్రీనివాస్‌, జనరల్‌ మేనేజర్‌ పెండ్యాల సుధాకర్‌, దివిస్‌ ఉద్యోగి వల్లూరి వెంకటరాజు, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.