మా మూడు గ్రామాలకు కలిపి ప్రత్యేక ఎంపిటిసి స్థానాన్ని ఏర్పాటు చేయాలి

– దోతి, మల్లాపూర్, మారేపల్లి, మూడు గ్రామాల ప్రజలు ఎంపీడీవో కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మద్నూర్
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం డోంగ్లి మండలాన్ని మండల పరిషత్ గా ఏర్పాటు చేయడం మద్నూర్ ఉమ్మడి మండలంలో నీ ఎంపీటీసీ స్థానాలను విడదీసి కొత్త మండలమైన డోంగ్లి మండలానికి ఐదు ఎంపిటిసి స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ కొత్త మండలంలో గల ధోతి, మల్లాపూర్, మారేపల్లి, ఈ మూడు గ్రామాలకు గతంలో మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ ఎంపీటీసీ పరిధిలో ఉండగా ప్రస్తుతం డోంగ్లి మండలంలోని మోగా ఎంపిటిసి పరిధిలోకి మార్చారు. మోగా ఎంపిటిసి స్థానం లో ఓట్ల సంఖ్య 5000 పైగా దాటాయని ఈ గ్రామంతో మాకు దూర ప్రాంతమే కాకుండా ప్రత్యేకంగా మా మూడు గ్రామాలను కలిపి ఒక ప్రత్యేక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు దోతి, మల్లాపూర్, మారేపల్లి, గ్రామాలకు చెందిన ఆల్ పార్టీల నాయకులు గ్రామస్తులు ఆయా గ్రామాల పెద్దలు మాజీ సర్పంచులు మద్నూరు ఉమ్మడి మండల ఎంపీడీవో రాణి కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ విజ్ఞప్తి చేశారు. ఈ మూడు గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఎంపీటీసీ స్థానంగా కేటాయించి ప్రత్యేక ఎంపీటీసీ ఏర్పాటు చేయాలని ఎంపీడీవో కు అందజేసిన ఫిర్యాదు కాపీలో మూడు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు. మీ డిమాండ్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని ఎంపీడీవో హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.