నవతెలంగాణ- ఆలేరుటౌన్
ప్రతి ఒక్కరూ సమాజ వికాసంలో భాగస్వాములు కావాలని, హుస్నాబాద్ ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు భూపతి కనకయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం స్పందన సహకార సంఘాన్ని తమ కమిటీ సభ్యులతో కలసి పరిశీలిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారని,కానీ సమాజ సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందన్నారు. జీవించి మరణించడం కాదని,మరణించినా మన ఆశయాలు,మనం కన్న కలలు జీవించిఉండడం ముఖ్యమన్నారు.తోటి వారి పట్ల ప్రేమను చూపుతూ ,వారి కష్టాలలో భాగస్వాములై సమాజంలో మానవతా విలువలను పెంపొందిం చాలన్నారు.స్పందన సహకార సంఘం చేస్తున్న కషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సీ. ఎచ్.మురళీధర్, కోశాధికారి బి.తిరుపతి, సభ్యులు సంజీవ రెడ్డి,కిషన్ నాయక్, ముత్తయ్య, రాజయ్య,బాల్ రెడ్డి, బాల కిషన్,బాల్ రెడ్డి,రఘుపతి రెడ్డి,మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,స్పందన సహకార సంఘం అధ్యక్షుడు ఖుర్షీద్ పాషా, మంత్రి దేవేందర్, బొందుగుల మాజీ సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.