రానున్న స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

We need to prepare for the upcoming local elections– బీజేపీ కార్యకర్తల సమావేశం

– మండల బీజేపీ అధ్యక్షడు ఏశాల దత్తత్రి
నవతెలంగాణ – కుభీర్
రాబోయే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలకు గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడి పనిచేసేలా కృషి చేయాలని బీజేపీ మండల అధ్యక్షడు ఏశాల దత్తత్రి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కుభీర్ శివ సాయి ఆలయంలో మండల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతితిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపెళ్లి  గంగా శేఖర్ హాజరై సమావేశం ప్రారంభించారు. అంతకు ముందు ఇటీవల మరణించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మరియు పల్సి సీనియర్ నాయకుడు విఠల్ సార్ మరణించడం తో వారికి సంతాపం చేపట్టి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అద్యక్షడు దత్తత్రి మాట్లాడుతూ..  రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేస్తే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లు బీజేపీ అభ్యర్థులను గెలుపొందెలా చూడలని అన్నారు. అదే విదంగా గ్రామంలో కార్యకర్త ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను చేసేలా కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సౌంలి రమేష్ ,మాజీ ఎంపీపీ యోగిత కమలేష్,బిఎస్ ఎన్ ఎల్ బోర్డ్ డైరెక్టర్ గంగాషేకర్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ వైద్యనాథ్ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.