
– మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
– మాల మహానాడు జిల్లా కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మాల మహానాడు జిల్లా కార్యాలయాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ జి. చెన్నయ్య గురువారం ప్రారంభించారు. మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జిల్లాలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ కార్యాలయం నుండి కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు, కవులు, కళాకారులు అంబేద్కర్ వాదులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో కన్వీనర్లు బూరుగుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్ బాబు, తలమల్ల హసన్, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకురాల సప్పిడి సావిత్రి, రాష్ట్ర నాయకులు గోలి సైదులు, సంద యాదగిరి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోగరి విజయకుమార్, జిల్లా అధ్యక్షులు చింతమల బాలకృష్ణ, జిల్లా అధ్యక్షులు యాదగిరి, మాల మహానాడు నల్లగొండ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బోగారి అనిల్ కుమార్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అంగ్గరాజు స్వర్ణలత, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకురాలు లలిత, ఖమ్మం జిల్లా ప్రధాన మహిళ కార్యదర్శి దామల విజయ, నల్లగొండ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు రొయ్య కిరణ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు సంద వరప్రసాద్, మాలమహానడు నిడమనూర్ మండల ఉపాధ్యక్షులు నాగటి సృజన్, తదితరులు పాల్గొన్నారు.