నవతెలంగాణ – పెద్దవంగర
పార్టీ కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాల కాపాడుకుంటామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. మండలంలోని పోచారం, చిన్నవంగర గ్రామాలకు చెందిన మద్దెల సోమలక్ష్మి (80), మచ్చ అశోక్ (28) వేరువేరు కారణాలతో ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, ఉపాధ్యక్షుడు రంగు మురళి, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు కాలేరు కరుణాకర్, బానోత్ వెంకన్న, జాటోత్ వెంకన్న, శ్రీనివాస్, సారయ్య, యాకన్న, జలగం వెంకటయ్య, యాసారపు వీరస్వామి, రాంపాక ఐలయ్య, పబ్బతి సంతోష్, యాసారపు సోమయ్య, జలగం సుధాకర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.