
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఈ ఖరీఫ్ సాగు కే నీళ్ళు అందిస్తామని,అందుకోసమే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు ప్రారంభిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. మండల పరిధి లోని గండి పడిన పెద్ద వాగు ప్రాజెక్ట్ కు మరమ్మత్తుల పనులకి శుక్రవారం కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్ సాగు కే ఆయకట్టు రైతులకి నీరు అందిస్తాం అనే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సంప్రదించి తాత్కాలిక మరమ్మతులు నిమిత్తం రూ. 3.5 కోట్ల లు నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించటం జరుగుతుందని అని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ అధికారులు నీటి పారుదల శాఖ ఈ.ఈ సురేష్ కుమార్,డీ.ఈ ఎల్. క్రిష్ణ,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, నాయకులు కార్యకర్తలు, ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.