అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తాం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
అర్హులైన ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని అదనపు కలెక్టర్ (పంచాయతీరాజ్) వీరారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని టేకులసోమారం, లోతుకుంట, ముద్దాపురం, లింగరాజు పల్లి, పహిల్వాన్ పురం, వెంకటాపురం గ్రామాలలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో టేకులసోమారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలుపరిచారని, మిగతా గ్యారెంటీలకోసం ప్రభుత్వo ప్రజల వద్దకే వచ్చి తమ తమ గ్రామాలలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.