ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి

నవతెలంగాణ-వీణవంక : ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని అడిషినల్ డీసీపీ లక్ష్మీనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని ఏసీపీ జీవన్ రెడ్డి, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనూజ్ కుమార్, సీఐ రమేష్, ఎస్సై ఎండీ ఆసీప్ తో పాటు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి సోమవారం ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా బీఎస్ఎప్ జవాన్లతో కవాత్ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అడిషినల్ డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. ఎన్నికల నియామావళిని ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ ఎలాంటి కార్యక్రమాలు చెపట్టాలనుకున్నా ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలపాలను పోలీసు దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.