ప్రజలను మభ్యపెడుతున్న బీజేపీని ఓడించాలి

– 26న వాహనాలతో ర్యాలీ
– రైతుసంఘం నాయకులు బొంతురాంబాబు, బాగం హేమంతరావు
నవతెలంగాణ-ఖమ్మం
సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా బిజిపి కేంద్ర పాలకులు అమలు చేస్తున్న రైతు-కార్మిక- ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 26వ తేదీన రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా వాహనాల ర్యాలీలను నిర్వహిం చాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని గిరిప్రసాద్‌ భవన్‌లో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు అధ్యక్షతన కార్మిక, రైతు సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా రైతు సంఘాలు దేశవ్యాపితంగా ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బందుకు పిలుపు నిచ్చాయన్నారు. ఈ పిలుపు జిల్లాలో విజయవంతం చేయడానికి వాల్‌ పోస్టర్‌ కరపత్రాలను విస్తృతంగా ఇంటింటికి పంపిణీ చేసి కేంద్ర బిజెపి పాలకుల అసలు నైజాన్ని ప్రజలకు వివరించటానికి కార్యక్రమాలను రూపొందిం చాలన్నారు. చారిత్రాత్మక రైతు ఉద్యమ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించడం, హామీలను నెరవేర్చటానికి నేటికీ ఏ ఒక్క చర్య తీసుకోకుండా క్షమించరాని నిర్లక్ష్యానికి పాల్పడుతున్న కేంద్ర పాలకులను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 26వ తేదీన హైదరాబాదులో సుందరయ్య పార్క్‌ బాగ్లింగంపల్లి నుండి ఇందిరాపార్క్‌ వరకు జరుగు వాహనాల ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. గత దశాబ్ద కాలంలో బిజిపి పాలన వల్ల దేశంలో పేదరికం పెరిగిపోయిందని, నిరుద్యోగ సమస్య అధిక ధరలు అధికమయ్యాయని, వ్యవసాయాన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేయడానికి సరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నాడన్నారు. రైతులు కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్య లను పరిష్కరిం చకుండా దారి మళ్లించుటంలో భాగంగా బాల రాముడు ప్రతిష్టాపన పేరుతో మభ్యపెడుతు న్నాడన్నారు. మతం రాముడుపై నమ్మకము భక్తి వ్యక్తిగతమైనవి అని, బిజెపి పాలకులు మతాన్ని రాజకీయాలకు జోడించి హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళటం ద్వారా మెజారిటీ హిందువుల ఓట్లు పొందటానికి చేస్తున్న కుతం త్రంగా అభివర్ణించారు. ప్రజలు ఎదుర్కొం టున్న ఆర్ధిక ఇబ్బందులను తొలగించేంత వరకు రైతాంగ కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటాలను తీవ్రతరం చేయాల్సిందిగా రైతులను కార్మికులను ప్రజలను వక్తలంతా కోరారు. అనేక సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి అమలు చేయటానికి పూనుకుంటున్న బిజిపి కేంద్ర పాల కులను ఓడించటానికి ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను తిప్పికొట్టడంలో అగ్రగామి పాత్ర వహించాలని ప్రతి ఆర్థిక పోరాటాన్ని రాజకీయ పోరాటంగా మలుచుకుని కొనసాగించాలని కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర బీజేపీ పాలకులను ఓడించటంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేయటానికి జనవరి 26వ తారీకూహనాల ర్యాలీని జిల్లా కేంద్రంలో విజయవంతం చేయటానికి, ఫిబ్రవరి 16 గ్రామీణబంద్‌ విజయవంతం చేయటానికి సర్వ సన్నద్ధులు కావాలని పిలుపు నిచ్చారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్‌, నాయకులు ఎస్‌.కె. మీరా, కూచిపుడి మధు, ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రాయల చంద్రశేఖర్రావు, ఆవుల వెంకటేశ్వర్లు, మలీదు నాగేశ్వరరావు, ఎఐకెఎంఎస్‌ జిల్లా కార్యదర్శి మురళీ, ఐఎన్‌టియుసి రాష్ట్ర నాయకులు కొత్త సీతారాములు, ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాదె లక్ష్మినారాయణ, తోట రామాంజ నేయులు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరెడ్డి, జి.రామయ్య, బిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు ఎస్‌.కె.పాషా, కార్యదర్శి కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పగిడిపల్లి ఏను, తాటి వెంకటేశ్వరరావు, సూరిబాబు పాల్గొన్నారు.