రాష్ట్ర స్థాయిలో రాణించి ఆదిలాబాద్ కు పథకాలు తీసుకురావాలి..

We should excel at the state level and bring the schemes to Adilabad.– క్రీడాకారులకు కలెక్టర్ దుస్తుల పంపిణి

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
గ్రామీణ ప్రాంత క్రీడకారులను గుర్తించి క్రీడల్లో రాణించేల ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడకారులకు స్పోర్ట్స్ దుస్తులను శనివారం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పథకాలు తీసుకురావాలని ఆకాక్షించారు. అనంతరం క్రీడాకారుల వివరాలు తెలుసుకుంటు క్రీడ స్పూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహం అందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా సీఎం కప్ పోటీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈనెల 30న హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో జరిగే ఆయా క్రీడ పోటీల్లో జిల్లా క్రీడకారులు పాల్గొంటారన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ఏ విధంగనైతే కష్టపడి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారో అదే స్పూర్తిని ప్రదర్శిస్తు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడాలాభివృద్ది అధికారి పార్థసారథి, రాజేష్, కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.