
నవతెలంగాణ – కంఠేశ్వర్
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అనేక మందికి మహనీయుల త్యాగాలతో భారత దేశ స్వతంత్రం సాధించిందని వారి త్యాగాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని రాజ్యాంగ ప్ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అతిథిగా జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి గంగారెడ్డి మెమోరియల్ హల్ లో బహుమతులు ప్రధానం చేసినట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. క్రీడలలో గణతంత్ర స్ఫూర్తిని నింపి వివిధ రకాల క్రీడలను నిర్వహించినట్లు తెలియజేశారు. జిల్లాజడ్జి సునీత మాట్లాడుతూ ఆటలు అందరిని ఆలరించాయని అన్నారు. బహుమతులు మరింత క్రీడల పురోగతికి పురికొల్పాలని ఆమె ఆకాంక్షించారు.న్యాయమూర్తులకు,న్యాయవాదులకు,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కు,న్యాయసిబ్బందికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిలు కనకదుర్గ,శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జిలు పద్మావతి, శ్రీకాంత్ బాబు జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భు ఉపాధ్యాయ్, గోపికృష్ణ, చైతన్య, హరి కుమార్,శ్రీనివాసరావు, బార్ ఉపాధ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొన్పల్ సురేష్,కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు.