ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు అండగా ఉంటాం

– ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని ఆర్‌.ఎం.పి పి.ఎం. పి వైద్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలో ధన్వంతరి అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో రూపొం దించిన తెలంగాణ ఆర్‌.ఎం.పి, పి.ఎం.పి పెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను స్థానిక కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌, వైద్యులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతా లతో పాటు పట్టణ ప్రాంతాల్లో పేద, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలందించే ఆర్‌.ఎం.పి, పి.ఎం.పి వైద్యులపై ఈమధ్య తరచూ దాడులు జరగడం బాధాకరమన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అన్ని విధాల అండగా ఉంటూ వారికి మద్దతుగా నిలిచామని, ప్రభుత్వ మార్పు తర్వాత ఇటువంటి సంఘట నలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌.ఎం.పి, పి.ఎం.పి వైద్యుల పట్ల అణచివేత ధోరణి అవలంభించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గం లోని ఆర్‌.ఎం.పి, పి ఎం పి వైద్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మెన్‌ వేణు యాదవ్‌, డివిజన్‌ అధ్యక్షులు రుద్ర అశోక్‌, సీనియర్‌ నాయ కులు ఓరుగంటి కృష్ణ గౌడ్‌,సాజిథ్‌, సీపీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ హుస్సేన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూ షణం, జగద్గిరిగుట్ట సంఘం అధ్య క్షులు డాక్టర్‌ వంగరి విష్ణు,ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కొమ్ము రాము, కోశాధికారి ఉప్పల రవి కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.