
– శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలి.
– రామగుండం పోలీస్ కమిషనర్ రెమ రాజేశ్వరి.
నవతెలంగాణ -దండేపల్లి: రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని ఆదివాసులకు పోలీసులు ఎప్పుడు తోడుగా ఉంటారని పోలీసులకు శాంతిభద్రతల పరీక్షల కొరకు ప్రజలందరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమ రాజేశ్వరి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించినట్లు ఆమె తెలిపారు. మండలంలోని సుమారు 30 గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజనులు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ఉచితంగా వైద్య పరీక్షలు మందులు తీసుకున్నారని ఆమె తెలియజేశారు. గిరిజనులకు పోలీస్ చట్టాల గురించి వివరంగా తెలియజేశారు. ప్రతి వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని ఆమె అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని గిరిజనులకు ఉచితంగా దరఖాస్తులు చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు కృషి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ తమ ధ్యేయమని ఆమె అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లే అని హెచ్చరించారు. అనుమాదాస్పద వ్యక్తులు తమ గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. సుమారు 1100 మంది గిరిజనులు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆమె పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమానికి తరలివచ్చిన గిరిజనులకు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి సుధీర్ కేకన్, అడిషనల్ కలెక్టర్ రాహుల్, ఏ ఆర్ అడిషనల్ డీజీపీ రియాజ్ హల్ హక్, ఏసీపీ తిరుపతిరెడ్డి, లక్షట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, దండేపల్లి ఎస్సై ప్రసాద్, డాక్టర్ల బృందం సభ్యులు, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జయ భారతి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ స్వప్నిక, డాక్టర్ గణపతి, మెడికల్ ఆఫీసర్లు సతీష్, అభిజ్ఞ, ప్రత్యూష, రాజు, ఆరోగ్య సిబ్బంది ఆయా గ్రామాల గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.