
నవతెలంగాణ-తొగుట
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని వేంకట్రావుపేట గ్రామంలో గత శుక్రవారం గుండె పోటుతో మరణించిన సపాయి కార్మికుడు ఈదు గాళ్ల భిక్షపతి, అకస్మాత్తుగా మరణించిన కల్లెపు చంద్రయ్య ఇరు కుటుంబాలను పరామర్శించారు. భిక్షపతి భార్య మల్లవ్వ, కుమారుడు మల్లేశం రూ. 2500 పాటు 50 కిలోల బియ్యం అందించారు. చంద్రయ్య భార్య సత్తవ్వ, మనుమడు నవీన్ లకు రూ.2500 ఆర్ధిక సహాయం అందించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని మనో ధైర్యం నింపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్య క్షులు పులిగారి శివయ్య, బూత్ అధ్యక్షులు డబ్బి కారి పెంటోజి, రైతుబంధు గ్రామ అధ్యక్షులు బండా రు స్వామి గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సుతారి రాములు, యూత్ అధ్యక్షులు ఎంగలి నరేందర్, వార్డు సభ్యులు కల్లెపు యాదగిరి, నాయకులు ఎర్రోళ్ల చంద్రం, కల్లెపు నరేష్ కుమార్, ఎర్రోళ్ల అర్జు న్, వడ్డే శేఖర్, పోచయ్య, ఎల్లం, నర్సింహులు, సుతారి రాంబాబు, నవీన్, కనుకరాజు తదితరులు పాల్గొన్నారు.