
నవతెలంగాణ – తొగుట
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ఎల్లవ్వ భర్త మైస య్య కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆయన పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతా పం ప్రకటించారు. మైసయ్య భార్య ఎల్లవ్వ, కుమా రుడు రాజులను పరామర్శించి రూ. 2 వేలు ఆర్ధిక సహాయం అందించారు. వారి కుటుంబానికి అండ గా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, గ్రామ నాయకులు బండారు స్వామి గౌడ్, ఈదుగళ్ల పర్శరాములు, చంద్రం, లక్ష్మన్, నరేష్, స్వామి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.