
నవతెలంగాణ – తొగుట
మృతుని కుటుంబానికి అండగా ఉంటామని మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని కాన్గల్ గ్రామంలో బత్తుల కిష్టయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మృతదేహానికి నివాళి ఆర్పించి వారి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిష్టయ్య మరణం బాధా కరమన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహ కారంతో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో చింతమడక శ్రీధర్, కరుణాకర్, బాలరాజు, పరశురాములు, రాజు, కనకరాజు తదితరులు ఉన్నారు.