
– బాధిత కుటుంబానికి 157500/-రూపాయల ఆర్ధిక సహాయం
నవతెలంగాణ-అచ్చంపేట : ఆపదలో ఉన్న పి ఆర్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ కుటుంబాలకు అండగా ఉంటామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల మరణించిన ఉపాధ్యాయుడు సతీష్ కుటుంబాన్ని మంగళవారం సంఘం సభ్యులు పరామర్శించారు. ఒక లక్ష యాభైయేడువేల ఐదువందల (157500/-) రూపాయల ఆర్థిక సాయం అందించారు. సంఘంలోని క్రియాశీల సభ్యులు ఏదైనా కారణంచేత అకాల మరణం చెందితే వారి కుటుంబాలను ఆదుకోవాలనే సత్సంకల్పముచే రాష్ట్ర సంఘ పెద్దలుమన సంఘం తరుపున ఒకలక్ష (100000)రూపాయలను ఆ బాధిత కుటుంబాలకు ఇచ్చి వారికి అండగా నిలబడాలని నిర్ణయించామని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయడమే కాదు మన సంఘ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ సూర్య శ్రీనివాస్ గౌడ్ , ,ప్రధాన కార్యదర్శి శ్రీ తుమ్మల సురేందర్ రెడ్డి ,గౌరవ అధ్యక్షులు రామచందర్ రావు ,పత్రిక సంపాదక వర్గ సభ్యులు శ్రీ దొడ్ల సత్యనారాయణ రెడ్డి ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బీచ్చా నాయక్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లాల్ సింగ్, వంగూరు మండల అధ్యక్షులు అనంత ప్రవీణ్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి క్యామ మల్లయ్య ,ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర ,జిల్లా ,వివిధ మండలాల బాద్యులు పాల్గొన్నారు .