స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటాం

నవతెలంగాణ-భిక్కనూర్
చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న నాగర్తి నరేష్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాల 2002 బ్యాచ్ చెందిన స్నేహితులు హామీ ఇచ్చారు. భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నరేష్ రెడ్డి గత జూన్ నెలలో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోగా పదవ తరగతి బ్యాచ్ కి చెందిన స్నేహితులందరు కలిసి రూ.36000 జమ చేసి అతడి కుమార్తె నక్షత్ర పేరు పైన పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దీనికి సంబంధించిన బాండ్ ను ఆదివారం స్నేహితులందరం కలిసి నరేష్ రెడ్డి భార్య మమతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ రెడ్డి స్నేహితులు లింగారెడ్డి, నీలేందర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీధర్, నరేష్, సందీప్, స్వామి, ధర్మారెడ్డి, సతీష్, అనిల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.