నవతెలంగాణ – సిద్దిపేట
ప్రయాణికుల అవసరాలు తీర్చడం కోసమే సిద్దిపేట నుండి కొమరవెల్లి, రాజాపేట , తుర్కపల్లి, బొమ్మలరామారం మీదుగా ఈసీఐఎల్ వరకు బస్సు ను ప్రారంభించడం జరిగిందని సిద్దిపేట అసిస్టెంట్ మేనేజర్ మహేశ్వరి, రాంసాగర్ సర్పంచ్ రవీందర్ లు అన్నారు. సోమవారం సిద్దిపేట బస్సు డిపోలో సిద్దిపేట నుండి ఈసీఐఎల్ వరకు సిద్దిపేట, నల్గొండ, జనగాం, మేడ్చల్ జిల్లాల మీదుగా వెళ్లే బస్సును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రజల కోరిక మేరకే ఈ బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగిందని, ఇది రోజుకు రెండు ట్రిప్పులు పోవడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గ్రామాలను కలుపుతు, నాలుగు జిల్లాల మీదుగా ఈ బస్సు వెళుతుందని ఇదేంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. పై అధికారుల సూచన మేరకు వేసవి కాలం సందర్భంగా మధ్యాహ్నము కార్మికులకు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు అందరికీ మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, ఆర్టీసీ సిబ్బంది మల్లేశం ,బిక్షపతి , కనకయ్య, కొండల్, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.