చర్చిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ..

We strongly condemn the attack on the church..– నిజామాబాద్ తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఈనెల 23 జనవరి గోల్కొండ క్రాస్ రోడ్ వద్ద గల హెబ్రోను చర్చి పై దాడి జరిగిందని నిజామాబాద్ తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా సభ్యులు రెవరెండ్ జెకర్యా ఆనంద్, పాస్టర్ డేనియల్ మాట్లాడుతూ చర్చి లోపలికి వచ్చి చొరబడి చర్చిలో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో పలువురు పాస్టర్లు సంఘ పెద్దలు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇలా దాడి చేయడం అమానుషమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.