వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం 

We strongly condemn the attack on Vikarabad collector– టీఎన్జీవో జిల్లా సంఘం పక్షాన నిరసన 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మీద జరిగిన దాడిని టీఎన్ జి వో ఎస్ నిజామాబాద్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం నిరసనగా టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం హుస్సేన్ ఆదేశాల మేరకు నూతన జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, అధ్యక్షతన,జిల్లా ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. దోషులు ఎంతటి వారైనప్పటికీ చట్ట పరిధిలో శిక్షలు విధించాలని జిల్లా అత్యున్నత అధికారైన కలెక్టర్ ప్రతీక్ మీద జరిగిన దాడి పట్ల ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పట్టికీ వాటిని పరిష్కరించుకునే మార్గం ఒకటి తప్పక ఉంటుంది, అంతే గాని చట్టాన్ని తమ చేతిలో తీసుకొని అధికారులు, ఉద్యోగుల మీద దాడులు చేయడం హేయమైన చర్యగా టి ఎన్ జి వో ఎస్ జిల్లా సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు,చిట్టి నారాయణరెడ్డి , కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చుకురి సతీష్, సలహాదారులు ఆకుల ప్రసాద్, కోశాధికారి దినేష్ బాబు,జిల్లా ఉపాధ్యక్షులు కేపీ.సునీత, సంజీవయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, ఉమా కిరణ్ రెడ్డి, విశాల్ రెడ్డి, టీఎన్జీవో నాయకులు తదితరులు పాల్గొన్నారు.