నవతెలంగాణ – మల్హర్ రావు
అమ్మ నాన్న లేని అనాధ పిల్లల్ని మేమే చదివిపిస్తానని ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి అన్నారు.మంగళవారం మండలంలోని దుబ్బెపేట గ్రామంలో అమ్మ నాన్న లేని పిల్లలున్నారని, వారిని ఆదుకోవాలని చిన్నారుల బంధువులు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన వచ్చినట్లుగా తెలిపారు. బంధువులతో మాట్లాడి ఆ పిల్లల చదువు పూర్తి బాధ్యత తామే తీసుకుంటామని, అలాగే వారిని పదో తరగతి వరకు తమ సొంత ఖర్చులతో చదివిపిస్తామని ఆ పిల్లల బంధువులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు.