ఆ పార్టీకే మా మద్దతు

ఆ పార్టీకే మా మద్దతు– దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్‌ సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేలా బిల్లు పెట్టించి చట్టబద్ధత కల్పించే పార్టీకే తమ మద్ధతు ఉంటుందని దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్‌ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఇశ్రాయేల్‌ తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ బేగంపేట, రసూల్‌ పురాలో సాధన సమితి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మత స్వేచ్ఛ కల్పించకుండా పార్టీలు మభ్య పెడుతున్నాయనీ, అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సాధన సమితి దక్షిణ తెలంగాణ ఇన్‌ఛార్జి ఎం.వీ.జాన్సన్‌, రాష్ట్ర యువజన అధ్యక్షులు పల్లె జోసఫ్‌, నాయకులు శంకర్‌ థామస్‌, షమన్న, రాజన్న, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.