– నార్సింగి చైర్ పర్సన్, కమిషనర్
– మొదటి వార్డులో పర్యటన వీధి కుక్కల తరలింపు
నవతెలంగాణ-గండిపేట్
సీజనల్ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని నార్సింగ్ చైర్‌ప ర్సన్ నాగపూర్ణ, కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం నా ర్సింగ్ మున్సిపాలిటీ వట్టినాగులపల్లి మొదటి వార్డులో చైర్‌పర్సన్ పర్యటిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మొదటి వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నా రు. వీధి కుక్కల బెడద నుంచి కాపాడేందుకు కుక్కలను తరలించినట్టు తెలి పారు. కుక్కలు ఉన్న ప్రాంతాలను గుర్తించి మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయా లని కోరారు. మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. చెత్త వ్యర్ధాలను పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. తడి, పొడి చెత్తను వెంటనే సేకరించి తరలించా లన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరించినందుకు సానిటేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాదమ్మ, సానిటేషన్ అధికా రి లచ్చిరాం, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.