
మండలంలోని గోకుల్ తాండ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల మదన్మోహన్రావు భాగస్వామ్యమై అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ ఆదివారం అన్నారు. సదాశివ నగర్ మండలంలోని మర్కల్ లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్మోహన్రావును తాండ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిలో తోడ్పడాలని ఎమ్మెల్యేను కోరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో తాండ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.