
– జిల్లా మాజీ అధ్యక్షులు ఈదన్న గారి సింహాచలం.
నవతెలంగాణ- రాయపోల్
ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటం ఫలించిందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థి సమాఖ్య జిల్లా మాజీ అధ్యక్షులు ఈదన్నగారి సింహాచలం అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగా సామాజిక న్యాయాన్ని గ్రహించి ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సామాజిక న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని,ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంతో మంది జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 2005లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను కొట్టివేసిన తర్వాత మళ్లీ ఉద్యమన్ని తీవ్రస్థాయికి తీసుకుపోవడానికి కృషి చేసిన మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు. 2005 ఎస్సీ వర్గీకరణ చెల్లదు అనే తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 6 మంది బెంచ్ న్యాయమూర్తులతో ఎస్సీలలో ఎస్టీలలో సామాజిక న్యాయం అవసరమని ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఫలితం యావత్తు జాతి సంతోషించవలసిన అవసరం ఉందన్నారు. ఈ విజయాన్ని జాతి ఉద్యమంలో అమరులైన అమరవీరులకు సామాజిక ఉద్యమకారులకు ప్రజాస్వామ్య వాదులకు అంకితం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు ఎస్సీ వర్గీకరణ ఎస్టి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ లను భర్తీ చేయాలని కోరుతున్నాము. ఎస్సీ ఎస్టి వర్గీకరణ పై వచ్చిన తీర్పును స్వాగతిస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంతూరి రాములు, డప్పు శ్రీనివాస్, ఉప్పల గంగాధర్, ఆసనోళ్ల చంద్రం, స్వామి,శ్రీనివాస్, కరమల్లని కనకయ్య,ఈదన్నగారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.