– ధర్మ సమాజ్ పార్టీ మండల కోఆర్డినేటర్ నందు
నవతెలంగాణ – రాయపోల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం మార్పు చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని, అలాగే ధర్మ సమాజ్ పార్టీ సూచించిన చిహ్నంను రాష్ట్ర చిహ్నంగా ఆమోదించాలని ప్రభుత్వానికి సూచించడం జరిగిందని ధర్మసమాజ్ పార్టీ రాయపోల్ మండల కోఆర్డినేటర్ గూని నందు అన్నారు. గురువారం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు రాయపోల్ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించడం అలాగే రాష్ట్ర చిహ్నంలో మార్పులు తేవాలని నిర్ణయించడాన్ని ధర్మ సమాజ పార్టీ స్వాగతిస్తుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మసమాజ్ పార్టీ పక్షాన నూతన చిహ్నాన్ని తయారుచేసి అది ఆమోదించవలసిందిగా కోరడం జరుగుతుందన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రూపొందించిన చిహ్నంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రం, అలాగే తెలంగాణ ప్రజలు ఎంతో గర్వించదగిన మహనీయులు అగ్రవర్ణ, భూస్వామ్య వ్యవస్థ పై పోరాటం చేసిన వీరులు అణగారిన, బడుగు బలహీన వర్గాల, బహుజన రాజ్యం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సమ్మక్క, సారక్క చిత్రాలను రూపొందించడం జరిగిందన్నారు. ఇది సమ సమాజ నిర్మాణం ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత కోసం రూపొందించిన రాష్ట్ర చిహ్నమని ఈ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దారులకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ నాయకులు అర్జున్, హేమాజీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.