– ఇందిరాశోభన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరోగ్య రంగంలో పరిస్థితుల కోసం బీఆర్‌ఎస్ వేసిన నిజనిర్ధారణ కమిటీని టు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ స్వాగతించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో మాతా, శిశు మరణాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యం తదితర ఘటనలను ఆమె గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ రాజీవ్ ఆరోగ్యశ్రీని నాశనం చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కవరేజీని రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. దమ్ముంటే కేటీఆర్, కమిటీ సభ్యులు చర్చకు రావాలని సవాల్ విసిరారు.