ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం– సీనియర్‌ నేత ఎలుగని ప్రభాకర్‌ గౌడ్‌
– పార్టీ మారడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తాం
నవతెలంగాణ-శంషాబాద్‌
రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అభివద్ధి కో సం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ పార్టీ మారడాన్ని సం పూర్ణంగా స్వాగతిస్తు ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని సుల్తాన్‌పల్లి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నా యకులు ఎలుగని ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా శుక్రవారం సీనియర్‌ నాయకులు గో సుల మల్లికార్జున్‌తో కలిసి గ్రామంలో మీడి యాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రా జేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతూ..4సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారన్నారు. సుల్తాన్‌పల్లి గ్రామాభి వద్ధికి ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కోట్లది రూపాయల నిధులు ఖర్చు చేశారన్నారు. మాజీ సర్పంచ్‌ దండు ఇస్తారి, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు కే. చంద్రా రె డ్డి సహకారంతో గ్రామాభివద్ధి జరిగిందన్నారు. ప్రభుత్వంలో ఉంటే అభివద్ధికి ఆటంకాలు ఉండవన్న ఉద్దేశంతో ఆయన పార్టీ మారడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపడుతు న్న అభివద్ధి సంక్షేమ పథకాలు రాజేంద్రనగర్‌ ని యోజకవర్గంలోని ప్రతి గడపకు చేరవేయడానికి ఆయన కషి చేస్తారన్నారు. రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన బీఆర్‌ఎస్‌ ప్రస్తుత పరిస్థితుల్లో కోలుకోలేని స్థితిలో ఉందన్నారు. ఈ కారణంతోనే ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్‌కు ఏవిధమైన సహ కారం విధంగానే అంతే స్థాయిలో కాంగ్రెస్‌ అభి వద్ధికి సహకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ అనుచరులుగా ఆయన మార్గంలో నడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలి పారు. కార్యక్రమంలో నాయకులు హరికు మార్‌, హరిచందర్‌ తదితరులు పాల్గొన్నారు.