– డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్..
నవతెలంగాణ – మునుగోడు
అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేచ్చేంత వరకు డివైఎఫ్ఐ సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు . గ్రామంలో నెలకొన్న సమస్యలతోపాటు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండ వ రోజు కు ముఖ్య అతిథిగా మహేష్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అధికారులను, పాలకులను తమ ఆస్తులను అడగడం లేదని వారి యొక్క డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని, వారి గ్రామానికి రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారని అన్నారు. అధికారులు , పాలకులు వీరి పోరాటాలకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. రెండు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు , అధికారులు పట్టించుకోకపోవడం సమస్యల పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామనేటటువంటి ఒక ప్రకటన కూడా చేయకపోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. ప్రస్తుత తరుణంలో మద్యం, డబ్బు రాజకీయాలు నడుస్తున్న ఈ రోజుల్లో గ్రామ సమస్యల మీద , సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేస్తున్నటువంటి డివైఎఫ్ఐ, ప్రజాసంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ లేకపోవడంతోటి విద్యార్థులు తరచూ రోడ్ల మీదికి రావడం మరియు మూగజీవాలు పాఠశాల ఆవరణలో నిత్యం సంచరించడం తద్వారా వాతావరణం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, కాబట్టి ఈ సమస్య పైన అధికారులు స్పందించి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఊపదంపూడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప ఏమాత్రం కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో లేరనీ విమర్శించారు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, వారు అనుచరులకు ఏ విధంగా పదవులు కట్టబెట్టాలి, తమకు ఏ పని చేస్తే వ్యక్తిగతంగా ఉపయోగపడుతుందో అనేటటువంటి ప్రధాన అంశాలుగా భావించి ఆ విధంగా స్థానిక ఎమ్మెల్యే పని చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ యొక్క ప్రధానమైన సమస్యలను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని లేని పక్షంలో డివైఎఫ్ఐ, ప్రజా సంఘాలు, గ్రామ ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మండల కేంద్రంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయం ముందు ధర్నాకు పూనుకోవడానికి కూడా సిద్ధపడతామని హెచ్చరించారు. తదనంతరం దీక్ష చేస్తున్న డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, ప్రజాసంఘాల నాయకులు నారగోని నరసింహ, బొందు అంజయ్య, కట్ట మారయ్య, పగిళ్ల మధు, బొందు సుందరయ్య, పగిళ్ల అంజయ్య, పగిళ్ల యాదయ్య,డివైఎఫ్ఐ మండల నాయకులు కట్ట ఆంజనేయులు, పగిళ్ల సాయి తేజ, బొందు నవీన్ తదితరులు పాల్గొన్నారు.