
జూన్ ఒకటవ తేదీలోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్షాలోమ్ తెలిపారు. బుధవారం నాడు ఆయన జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడుతూ జిల్లాలో 323 ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటు ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల 82 వేల 330 మెటిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 77 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయి మూసి వేయడం జరిగిందని, మిగతా 246 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 320 లారీలు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా హన్మకొండ జిల్లాకు పది వేల మెట్రిక్ టన్నులు, జనగాం జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లాకు పది వేల మెట్రిక్ టన్నులు, నల్లగొండ జిల్లాకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడి మిల్లులకు పంపిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాలలోని హమాలీలను ఇతర కేంద్రాలకు పంపించి ధాన్యం త్వరగా మిల్లులకు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సహకార శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, మండల స్పెషల్ ఆఫీసర్లు, టీముల పర్యవేక్షణలో కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, వ్యవసాయ అధికారులు ధాన్యం నాణ్యతలను పరీక్షించి గ్రేడింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని, అదే విధంగా రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కలిగించాలని తెలిపారు. 400 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, కొనుగోలు కేంద్రాలలో 4 వేల టార్పాలిన్స్ అందుబాటులో వున్నాయని, మరో వెయ్యి టార్పాలిన్స్ పంపిస్తామని, గన్నీ బ్యాగుల కొరత లేదని, మిల్లర్లతో తరచూ సమవేశమై అన్లోడింగ్ సమస్యలు రావద్దని, ట్రక్ట్స్ త్వరగా పంపాలని, అవసరమైతే ప్రయివేటు గోదాములలో స్టోరేజీ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించడం జరిగిందని, జిల్లాలో ఇంకా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లిఫ్ట్ చేయాల్సి ఉందని, జూన్ ఒకటవ తేదీ లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.