సజావుగా పాఠశాల ఎన్నికలు చేపడుతాం..

– నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్

నవతెలంగాణ- పెద్దవంగర: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనెల 29న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సజావుగా చేపడుతామని మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఉపాధ్యాయులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 22న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు తల్లిదండ్రుల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, 24న ఉదయం 10 గంటలకు తుది ఓటర్ల జాబితా ప్రతి పాఠశాలలో నోటీస్‌ బోర్డుపై ఉంచుతామని చెప్పారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సభ్యులను ఎన్నుకుంటారని తెలిపారు.ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అంజయ్య, యాకయ్య, షౌకత్ అలీ, విజయ్ కుమార్, వెంకన్న, శ్రీనివాస్, సువర్ణ కరుణ తదితరులు పాల్గొన్నారు.