మద్దిమడుగు కృష్ణానది పైన వంతెన నిర్మాణం ఏర్పాటు చేస్తాం

– సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మండల పరిధిలోని మద్దిమడుగు సమీపంలోని గీస్గండి కృష్ణానది పైన వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సౌకర్యాన్ని వినియోగదారులకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ముందుకు దూసుకుపోతుందని పేద ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గీస్ గండి వద్ద ఏర్పాటు చేయనున్న వంతెన నిర్మాణం వల్ల రెండు రాష్ట్రాల మధ్య వంతెన నిర్మాణం చేయడంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్ న్యాయవాది తదితరులు ఉన్నారు.