
అమరుల ఆశయాలను కొనసాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ గణపురం లక్ష్మణ్ అన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సోమవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో గల సాయుధ పోరాట యోధుల స్తూపానికి గ్రామ శాఖ కార్యదర్శి కామ్రేడ్ బూరుగు యాదగిరి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రజెండా ఎగరవేసిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గణపురం లక్ష్మణ్ మాట్లాడుతూ సాయుధ పోరాట యోధుల ఆశయాలను కొనసాగిస్తామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న పోరాటంలో, ఏ ఆశయాల కోసమైతే ప్రాణ త్యాగం చేసిన విద్యార్థుల బలిదానాలు ఈ రాష్ట్రంలో వృధాగా పోతున్నాయి తప్ప,, వారి ఆశయాలను నెరవేర్చలేదు. కాబట్టి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆశయాల సాధన కోసం మరొక ఉద్యమాన్ని నిర్మిస్తామని, ఏ ఆశయం సాధన కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నాము, నీళ్లు, నిధులు, కొలువులు, నీళ్లు ఉన్నా, కొలువులు లేకుండా పోయినాయి. చదువుకున్న యువత ఇవాళ ఉపాధి అవకాశాలు లేక, రోడ్లమీద తిరిగే పరిస్థితి దాపురించింది. ఎన్ని మాటలు చెప్పినా ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇప్పటికైనా మన కొలువుల కోసం,పోరాటం చేద్దామని ,ఈ సందర్భంగా లక్ష్మణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొమ్మెర ఎల్లయ్య , పబ్బోజుఏకాంత చారి, కోటగిరి కాంతం, గూడేల్లి ఎల్లయ్య ,దొనక యాకయ్య, బట్ట మేకల కొమరయ్య, లింగాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.