అర్హులకు ‘డబుల్‌’ ఇండ్లు దక్కేంత వరకూ పోరాటం కొనసాగిస్తాం

మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి
నవతెలంగాణ-మోతె
అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు దక్కేంతవరకు అఖిలపక్ష పార్టీలను కలుపుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తమ్‌ పద్మావతి అన్నారు.బుధవారం అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు ఆమె సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.మోతె మండలంలో రావిపహాడ్‌, అప్పన్నగూడెం,విభలాపురం, నాగయ్యగూడెం గ్రామాలలో నిర్మించిన150 ఇండ్లను అర్హులకు ఇవ్వకుండా అర్హత లేని వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏంని ప్రశ్నించారు.ఈ నాలుగు గ్రామాలలో దళితులు, బడుగు ,బలహీన వర్గాలు, వికలాంగులు ,ఒంటరి మహిళలు ఉన్నారన్నారు.వారికి కాకుండా వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలు ,ఇండ్లు ఉన్నవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఎందుకు ఇచ్చారో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.అప్పన్నగూడెం గ్రామంలో లబ్దిదారుల లిస్టు ఫైనల్‌ కాకుండా చాలామంది అక్రమంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఆక్రమించుకొని అందులో నివాసం ఉంటున్నారని, అధికారులు వారిని వెంటనే ఆ నివాసాల నుండి తొలగించి అక్రమంగా చొరబాటుకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.రేషన్‌ కార్డులు సైతం లేని వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు.ఏడాదికాలంగా ‘డబుల్‌’ ఇండ్ల సమస్యలపై ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.ఇండ్లు సాధించేంతవరకు అఖిలపక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీటీ సోమపంగ సూరయ్యకు అందజేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెట్టి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు,కొలిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినోద్‌నాయక్‌ ,ధనియాకుల శ్రీకాంత్‌ వర్మ ,కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్‌ రెడ్డి, మండల నాయకులు ముదిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, కోట సుధాకర్‌రెడ్డి, కోట మధుసూదన్‌రెడ్డి,సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మండల కార్యదర్శి ములుకూరి గోపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌మండల నాయకులు సోమగాని జానకిరాములు,బండారు ప్రభాకర్‌రెడ్డి,బోళ్ల వెంకటరెడ్డి, డీివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు వెలుగుమధు చేగువేరా ,సిపిఎం మండల కమిటీ సభ్యులు నాగం మల్లయ్య ,చర్లపల్లి మల్లయ్య, ములుకూరి మణెమ్మ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల సాధన కమిటీ మండల అధ్యక్షులు బొర్రాజు ఎల్లయ్య, మండల ప్రధానకార్యదర్శి వీరమల్ల వెంకట్‌ ,నాయకులు పెరుమాండ్ల ఎల్లయ్య ,చాపల మల్లిక ,విజయ, కంచం లక్ష్మి, కల్లేపల్లి సుగుణమ్మ, అక్కి నపల్లి నాగలక్ష్మి,గోపి,రమణ,మోత్కూరి రేణుక, పొడపంగినగేష్‌,ఇట్టమల్ల మాణిక్కమ్మ, ఉప్పమ్మ,ఏపూరు అనూష తదితరులు పాల్గొన్నారు.–