నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే దాట డానికి అండర్ పాస్ నిర్మాణం చేసేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటి కన్వీనర్ సిల్వేరు ఎల్లయ్య , కో- కన్వీనర్లు మందడి సిద్ధారెడ్డి, కంచి మల్లయ్య లు మంగళవారం అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో సదస్సు నిర్వహించినారు ఈ సందర్భంగా ఎల్లయ్య , సిద్ధారెడ్డి, మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అండర్ పాస్ నిర్మాణం వెంటనే చేపట్టాలని, ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ప్రమాదంలో గాయపడి వికలాంగులైన వారికి నష్టపరిహారం ఇవ్వాలని నిర్వహిస్తున్న ధర్నాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పాలకులు ప్రజల ప్రాణాలు కాపాడడానికి బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు. రోడ్డు నిర్మాణం జరిగన నుండి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని మరిన్ని ప్రాణాలు పోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకొని అండర్ పాస్ నిర్మాణం వెంటనే చేపట్టాలని వారు సూచించారు. అనంతరం గ్రామ అధ్యక్షులుగా భువనగిరి రాములు, ఉపాధ్యక్షులుగా ఆర్. భాగ్య, కార్యదర్శిగా వై. జనార్ధన్, సహాయ కార్యదర్శిగా ఈ లక్ష్మీ నరసయ్య ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, కిష్టయ్య, సుందరమ్మ, యాదగిరి, దానయ్య, భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు.