
– పబ్లిక్ క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
పబ్లిక్ క్లబ్ ను సభ్యులు ,ప్రజల సహకారంతో ఫ్యామిలీ క్లబ్ గా మారుస్తామని నూతనంగా ఎన్నికైన పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు శనివారం స్థానిక క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డివొ , పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులైన వేణుమాధవ్ నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా కొప్పుల వేణరెడ్డి, ఉపాధ్యక్షులుగా మర్రు హనుమంతరావు, సహయ కార్యదర్శిగా బొల్లెద్దు దశరథ, కోశాధికారిగా కాక్కిరేణి శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులుగా శనగని రాంబాబు గౌడ్, పోలెబోయిన నర్సయ్య యాదవ్,గవ్వ కేశవ్ రెడ్డి,ఫరిదుద్దీన్ అహమద్,నిమ్మల వెంకటేశ్వర్లు,బత్తిన వెంకటేశ్వర్లు,రాచకొండ శ్రీనివాస్,గవ్వ కృష్ణారెడ్డి,చల్ల సత్యనారాయణ లను క్లబ్ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో క్లబ్ నూతన ప్రధాన కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ అంతా కలిసి పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం కలిసి మెలిసి పనిచేద్దామని చెప్పారు. గతంలో తాను క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేసానని తెలిపారు. షటిల్ కోర్టు నిర్మాణం చేసి 300 మంది ప్రముఖులకు 25000/- లతో సభ్యత్వం ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో పనిచేసిన కమిటీ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన జమ ఖర్చుల వివరాలు తమకు అందిన తర్వాత పరిశీలన చేస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి, నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో పబ్లిక్ క్లబ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని వస్తామని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన క్లబ్ ప్రధాన కార్యదర్శిని,సభ్యులను నాయకులు, అభిమానులు పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.