– రాహూల్ గాంధీ ట్వీట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి అధికార భవనమైన ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజా పాలన భవన్‌గా మార్చనున్నట్టు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాందీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రజా పాలన భవన్‌ను 24/7 తెరిచే ఉంచుతామని తెలిపారు. సీఎం, మంత్రులందరూ ప్రజా దర్బార్‌లు నిర్వహించి ప్రజల సమస్యలను 72 గంటల్లో పరిష్కరించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ విజయంతో ‘ప్రజల తెలంగాణ’ సువర్ణ యుగానికి నాంది పలుకుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.