వేములకొండ పి హెచ్ సి ని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తాం-సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

నవతెలంగాణ -వలిగొండ రూరల్: వనగిరి నియోజకవర్గ అభ్యర్థి కొండమడుగు నరసింహను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా మార్చి 24 గంటల వైద్య సౌకర్యం అందిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. సోమవారం వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి, వేములకొండ, వెంకటాపురం, వెలువర్తి, తుర్కపల్లి, సుంకిశాల గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు  మాట్లాడుతూ వేములకొండ ప్రాంతంలోని గ్రామాల ప్రజల సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గోపరాజుపల్లి నుండి నుండి దుప్పెళ్ళి వరకు బీటీ రోడ్డును నిర్మాణం చేయలేక పోయారని విమర్శించారు. వేములకొండ లో ఉన్న ప్రాధమిక ఆస్పత్రినీ 30 పడకల హాస్పిటల్ గా మారుస్తామని 24 గంటల వైద్య సేవలు అందిస్తామని చెప్పిన హామీని విస్మరించారని, వేములకొండలో ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు.  భువనగిరి నియోజకవర్గం లో సీపీఐ(ఎం) అభ్యర్థిని  ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేములకొండ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చి 24 గంటల వైద్య సేవలు అందిస్తామని అన్నారు. వెంకటాపురం పల్లెర్ల స్టేజి వరకు గల రోడ్డులో బీటీ రోడ్డుగా మారుస్తామని అన్నారు. మూసి ప్రక్షాళన కోసం కృషి చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని వేములకొండ గుట్ట అభివృద్ధి కోసం అధిక నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా వేములకొండ ప్రాంతం అభివృద్ధికి ఉంచుకోవడంలేదని ప్రజల అదృష్టం మేరకు వేములకొండ మండల సాధన కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, గడ్డం వెంకటేశం, గుండు వెంకట నర్సు,మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్కూరి రామచంద్రర్, తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, కవిడే సురేష్, కర్ణ కంటి యాదయ్య, కొండే కృష్ణయ్య, కలుకూరి ముత్యాలు, శాఖ కార్యదర్శులు ఏనుగుల నరసింహ, కంబాలపల్లి మహేష్, వెల్మ కన్నె బాలరాజు, గూడూరు వెంకట నరసింహారెడ్డి, కోలగాని వెంకటేశం, నాయకులు సిర్పంగి శ్రీరాములు, రాధారపు మల్లేశం, పిట్టల అంజయ్య, ధర్మాచారి, పల్సం స్వామి, గాజుల మల్లయ్య, వెంకటేశం, కాడిగళ్ళ రాకేష్, సలిగంజి నరసింహ, రుద్రపళ్లి లింగయ్య, నారి రామస్వామి, సలిగంజి వెంకటేశం, కంబాలపల్లి వెంకటేశం, గాజుల పద్మ, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.