పర్మిషన్ లేకుండా ఇండ్లను నిర్మిస్తే కూల్చి వేస్తాం

– మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్
– మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్
– జనవరి 26న ఉత్తమ మున్సిపల్ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న మహమ్మద్ ఆయాజ్ తో నవ తెలంగాణ    జమ్మికుంట విలేఖరి ఇంటర్వ్యూ
నవతెలంగాణ: ఉత్తమ మున్సిపల్ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది?
కమిషనర్: చాలా సంతోషంగా ఉంది. జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధి పట్ల మరింత బాధ్యతను పెంచింది.
నవతెలంగాణ: ఏ యే అంశాల పైన అవార్డు ఇచ్చారు?
కమిషనర్: ఇంటి పన్ను 75 శాతము వసూలు చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలవడం జరిగింది. ప్రజా పాలన విజయోత్సవంలో, నీటి పన్ను వసూల్లో మూడవ స్థానం , ఫండ్స్ యుటిలైజేషన్ లో ముందంజలో ఉండడంతో అవార్డు రావడం జరిగింది.
నవతెలంగాణ: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఏ  యే గ్రామాలు ఉన్నాయి?
 కమిషనర్: జమ్మికుంట పట్టణం, ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి, మోత్కులగూడెం, కేశవపురం, ఆబాది జమ్మికుంట ఉన్నాయి.
నవతెలంగాణ: ఇంత జనాభా, ఓటర్లు ఉన్నారు?
కమిషనర్: సుమారు 55 వేల మంది జనాభా, 33 వేల మంది ఓటర్లు ఉన్నారు.
నవతెలంగాణ: ఎన్ని ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి?
కమిషనర్:1300 ఉన్నాయి.
నవతెలంగాణ: మొత్తము ఎన్ని ఇండ్లు ఉన్నాయి?
కమిషనర్: 12,345 ఇండ్లు ఉన్నాయి.
నవతెలంగాణ :ఇంటి పన్ను ఎంత వసూలు చేశారు?
కమిషనర్:75.02 శాతము జనవరి 31 వరకు వసూలు చేయడం జరిగింది.
నవతెలంగాణ: నల్ల కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి?
కమిషనర్ :12,511 ఉన్నాయి. ప్రతి నల్ల కనెక్షన్ ను ఆన్లైన్ చేయడం జరిగింది. నల్ల కనెక్షన్ మాత్రమే ఫ్రీగా ఇస్తున్నామని, నెలవారి నల్ల బిల్లులు తప్పకుండా చెల్లించాలని ఎలాంటి మాఫీ ఉండదు.
నవతెలంగాణ: మున్సిపల్ కార్మికులు సిబ్బంది, రెగ్యులర్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు?
కమిషనర్: మున్సిపల్ కార్మికులు సిబ్బంది 210 మంది ,రెగ్యులర్ ఉద్యోగస్తులు 55 మంది ఉన్నారు.
నవతెలంగాణ: మున్సిపల్ సిబ్బందికి నెలకు ఎంత జీతాలు చెల్లిస్తున్నారు?
కమిషనర్ మున్సిపల్ సిబ్బందికి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించడం జరుగుతుంది. నెలకు 35 లక్షలు సిబ్బందికి, ఈఎస్ఐ ఈపీఎఫ్ 12 లక్షలు, పారిశుద్ధ్య నిర్వహణ 6 లక్షలు, కరెంట్ బిల్లులు6 లక్షలు చెల్లిస్తున్నాము.
నవతెలంగాణ :మున్సిపల్ సంవత్సర ఆదాయం ఎంత?
కమిషనర్ :సుమారు 7 కోట్లు
నవతెలంగాణ: పారిశుద్ధ్యం గురించి
కమిషనర్: ఇంతకుముందు 15 ఆటోలు ఉండేవి. నేను వచ్చిన తర్వాత 6 ఆటోలు తెప్పించాము. ఇంకా 9 ఆటోల కు ప్లాన్ చేస్తున్నాము. రెండు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగింది.
నవతెలంగాణ: పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు జరగడం లేదని ఆరోపణ ఉంది. మీరు ఏమంటారు?
కమిషనర్: తప్పు. జమ్మికుంట లో ఉన్నటువంటి 30 వార్డులలో ప్రతిరోజు మా సిబ్బంది మురికి కాలువలు తీస్తున్నారు. ప్రతిరోజు ప్రతి వాడకి చెత్తను తీసుకురావడానికి ఆటోలు వెళుతున్నాయి.
ఎక్కడైనా మురికి కాలువలు తీయకపోయినా, చెత్త బండి రాకపోయినా నేరుగా నా దృష్టికి తీసుకువస్తే అట్టి వారిపై చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ: హరితహారం నిర్వహణ గురించి
కమిషనర్: జమ్మికుంట పట్టణంలో గత వర్షాకాలంలో చెట్లను నాటడం జరిగింది. రెండు ట్రాక్టర్స్ ద్వారా నీటిని వాటికి పోయడం జరుగుతుంది. వీణవంక రోడ్ లో ఆబాది జమ్మికుంట వరకు రోడ్డు మధ్యలో చెట్లను పెడతాం.
నవతెలంగాణ :కూరగాయలు రోడ్లపై అమ్ముతున్నారు మీరేమంటారు?
కమిషనర్: సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో రైతు బజార్ ను నిర్మించడం జరిగింది. కూరగాయలు అమ్ముకునే వారంతా అక్కడే అమ్ముకోవాలి. రోడ్లపై కూరగాయలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ: మంగళవారం జరిగే సంత రోడ్డుపై జరగడం వలన వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది మీరేమంటారు?
కమిషనర్: వీణవంక రోడ్డులో సంత జరగడం వలన వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో శివాలయము ఆవరణంలో పెట్టించడం జరిగింది.
నవతెలంగాణ :పట్టణ అభివృద్ధి గురించి
కమిషనర్: సుమారు నాలుగు కోట్ల రూపాయలతో జమ్మికుంట పట్టణ అభివృద్ధి పనులు ఫ్లై ఓవర్ పై సెంట్రల్ లైటింగ్ , రోడ్లు డ్రైనేజీ, లాంటి పనులు జరుగుతున్నాయి.
నవతెలంగాణ :పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణ ఉంది. మీరేమంటారు?
కమిషనర్: దళారులను నమ్మి మోసపోవద్దు .తప్పకుండా ఇంటి పర్మిషన్ ఆన్లైన్ లో అప్లై చేసి, పర్మిషన్ తీసుకుని వచ్చిన తర్వాతనే ఇంటి నిర్మాణము చేపట్టాలి. ఇంటి పర్మిషన్ లేకుండా ఇండ్లను నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అట్టి ఇండ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు.