అన్ని విధాలుగా ఆలేరు నియోజకవర్గంను అభివృద్ధి చేస్తాం

We will develop Aleru constituency in all ways– రైతుల రుణమాఫీతో దేశానికి తెలంగాణ రోల్డ్ మోడల్
– ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం
– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
– వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీపీ రాజేష్ చంద్ర
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
అన్ని విధాలుగా ఆలేరు నియోజకవర్గంను అభివృద్ధి చేస్తాం అని, రైతుల రుణమాఫీతో దేశానికి తెలంగాణ రోల్డ్ మోడల్ గా నిలుస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం బహుపేట ఆదివారం, వాటర్ ప్లాంట్, వైర్ లెస్ సీసీ కెమెరాలు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీపీ రాజేష్ చంద్ర లు కలిసి ప్రారంభించారు. బీర్ల అయిలయ్య మాట్లాడుతూ నేర నియంత్రణ కు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రజలుకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో గ్రామంగా వైర్ లెస్ టెక్నాలజీ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అని అన్నారు. ఈ గ్రామాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుని టెక్నాలజీ ఉపయోగించుకుని కెమెరాలు బిగించి, నేర రహిత సమాజం వైపు ముందడుగు వేయాలని సూచించారు. ఆలేరు నియోజకవర్గంలో అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు అని, ఆ తర్వాత గ్రామంలోని ప్రజలు అందరూ ఏకమై గ్రామ అభివృద్ధి వైపు కృషి చేయాలని అన్నారు. రైతు రుణమాఫీ తో తెలంగాణ రైతు కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. బహుపేట గ్రామాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద కందుకూరు మాజీ సర్పంచ్ భీమగాని రాములు, కర్రే వీరయ్య, ఎడ్ల రామ్ రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, నమిలె రామచందర్, ఈదులకంటి భాస్కర్, కానుగు బాలరాజ్ గౌడ్, భరత్ గౌడ్ అధికారులు, ఏసీపీ, సిఐ లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.