అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం

– వచ్చే ఎన్నికల్లో, బరిలో నిలిచేది గెలిచేది ప్రణవ్ బాబు నే : ఎమ్మెల్సీ బల్మూరి
–  బల్మూరికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ – జమ్మికుంట
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బరిలో నిలిచేది  ఎన్నికల్లో గెలిచేది ప్రణవ్ బాబు నే అని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని, ఎమ్మెల్సీ ఫండ్ నుండి వచ్చే 50 లక్షలు ఈ నియోజకవర్గానికే కేటాయిస్తానని, ఈ నియోజకవర్గంలో ఒక కుటుంబ సభ్యుని లాగా ఉంటానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్  అన్నారు. ఆదివారంఎమ్మెల్సీ గా పదవీ చేపట్టిన అనంతరం మొదటిసారిగా జమ్మికుంట  కి వచ్చిన వెంకట్ కి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజక వర్గ ఇంఛార్జి ప్రణవ్ బాబు అధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు గజమాలతో, భారీ స్వాగతం పలికారు. శాలువాతో నాయకులు ఘనంగా సన్మానించారు. మొదటగా మోత్కులగూడెం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి  బల్మూరి పూల మాల వేశారు. బాణాసచాలు పేల్చికార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ నేను ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా జమ్మికుంట కి వచ్చానని, ఇంత గొప్పగా నన్ను ఆదరించి స్వాగతం పలికిన ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త,నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రతిపక్ష నాయకులు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.స్థానికంగా ప్రణవ్ ఓడిన మా దృష్టిలో ఇక్కడ ఎమ్మెల్యే ప్రణవ్ అని, ప్రణవ్ కి సోదరుడి గా నేను ఉన్నానని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.హుజురాబాద్ నియోజకవర్గాన్ని ప్రణవ్ నేను ఇద్దరం కలిసి అభివృద్ధి దిశగా పనిచేస్తామని తెలిపారు. ప్రతి గడపగడపకి తిరుగుతామని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటిలను,హామీలను నెరవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కసుబోసుల వెంకన్న, మొలుగూరి సదయ్య, అరుకాల వీరశలింగం, పొన్నగంటి మల్లయ్య, రాజేశ్వరరావు ,సదానందం, రమేష్ , పూదరి రేణుక శివకుమార్ ,ఎండి సలీం, వొల్లాల శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.