యాదగిరిగుట్టలో టూరిజంను అభివృద్ధి చేస్తాం

We will develop tourism in Yadagiriguttaనవతెలంగాణ – యాదగిరిగుట్ట 
యాదగిరిగుట్టలో టూరిజం ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట ఆదివారం, ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో టూరిజాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొండపైన ఉన్న హరిత హోటల్ ను కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. హరిత హోటల్ లో మొత్తం 30 రూములు ఉండగా 15 రూములను వాడుతున్నట్లు మిగతా 15 రుములు వాడుకలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు నెలల లోపే పనులన్నీ పూర్తి చేసి 30 రూములను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. యాదగిరిగుట్టలో టూరిజనికి సంబంధించి నాలుగు ఎకరాల భూమి ఉన్నది. దానిని కూడా భక్తులకు సౌకర్యాల కోసం అభివృద్ధి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి కొలనుపాకకు కూడా  అవసరమైన నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు.