
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
మెడికల్ అండ్ హెల్త్, ఇతర విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేతన సొసైటీ నీ స్థాపించామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ కే ప్రసన్న, ప్రధాన కార్యదర్శి సైఫాబేగం అన్నారు. శుక్రవారం చేతన సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో చేతన సొసైటీ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ , ఇతర విభాగాల్లో జరుగుతున్న అవినీతి పై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. హెల్త్ డిపార్ట్ మెంట్, అన్ని డిపార్ట్మెంటులో సీనియార్టీని పరిగణంలోకి తీసుకోకుండా ప్రమోషన్లు కల్పిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. పలు విభాగాల్లో ప్రమోషన్లలో అక్రమాలు, అక్రమ మార్గంలో ఉద్యోగ పదోన్నతులు, ఉద్యోగులపై వేధింపులు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.ఈ అక్రమాలను అరికట్టడానికి చేతన సొసైటీ పోరాడుతుందన్నారు.వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పించనర్స్ ఉద్యోగస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టుఉద్యోగులు, పించనర్స్, ఇతర విభాగాల్లోని ఉద్యోగస్తులు సమస్యలు ఉంటే ఈ నెంబర్9505554646,9866355940 లను సంప్రదించాలన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు.